కళ్లు ఎర్రగా మారాయా..? ఈ ఇంటి చిట్కాలతో సమస్యను సాగనంపండి..!

మన శరీరంలో Eyes ఎంతో సున్నితమైన భాగాలు కావడంతో ఎక్కువగా కంటిని చేతితో తాకలేము. అయితే ఈ విధమైన సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కళ్లు ఎర్రగా మారిపోయి ఇబ్బందిపడుతుంటారు. మరి ఇలా ..

కళ్లు ఎర్రగా మారాయా..? ఈ ఇంటి చిట్కాలతో సమస్యను సాగనంపండి..!
Avoid Red eyes with home tips


Red eyes : మనిషి అందం, ఆరోగ్యం రెండు కళ్లమీద ఆధారపడి ఉంటాయి.. ఎలా అంటారా.. మీ కళ్లు ఆరోగ్యంగా లేకపోతే.. ముఖం నీరసంగా అయిపోతుంది. అలిసిపోతారు. Eyes కింద డార్క్‌ సర్కిల్స్‌, పఫ్వీ ఐస్‌ వస్తే.. మీ ఏజ్‌ ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా Eyes మన ఇమేజ్‌ డామేజ్‌ చేసేస్తాయి. కొన్ని సార్లు మన కళ్లు వివిధ కారణాల వల్ల ఎంతో అలసిపోయి ఎరుపుగా మారుతాయి. మన శరీరంలో కళ్ళు ఎంతో సున్నితమైన భాగాలు కావడంతో ఎక్కువగా కంటిని చేతితో తాకలేము. అయితే ఈ విధమైన సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కళ్లు ఎర్రగా మారిపోయి ఇబ్బందిపడుతుంటారు. మరి ఇలా అలిసిపోయిన కళ్లకు ఇంటి చిట్కాలు ఎలా పనిచేస్తాయో చూద్దామా..!

చాలామందిలో డ్రై ఐ సిండ్రోమ్, అలర్జీ, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, కంటికి గాయాలు అవడం, ధూమపానం చేయడం, జలుబు, ఫ్లూ వంటి వాటి ద్వారా కళ్ళు ఎంతో అలసిపోయి ఎర్రగా మారుతుంటాయి. చికాకు చెందిన కళ్ళు ఉపశమనం పొందడానికి కమోమిల్‌ ఐ వాష్ ఎంతో ఉపయోగకరం అని చెప్పవచ్చు. ఇది మన కంటిలో పడిన దుమ్ము, ధూళి కణాలను తొలగిస్తుంది. కళ్ళకు చల్లదనాన్ని కల్పిస్తుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి బాగా మరిగించాలి. ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎండిన Chamomile ఆకులను వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఆ నీటిని చల్లబరిచి వాటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ల మంటలు తగ్గుతాయి.
ఎర్రగా మారిన కళ్ళకు రోజ్ వాటర్ ఒక మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. శుభ్రమైన డ్రాపర్ సహాయంతో మూడు నుండి నాలుగు చుక్కలు రోజ్ వాటర్‌ను ప్రతి కంటిలో వేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మన కంటిలో ఉన్న మలినాలు తొలగిపోయి కళ్ళకు ప్రశాంతత కలుగుతుంది. కళ్లు చల్లగా అవుతాయి.
కంటికి కలిగిన అసౌకర్యం నుంచి విముక్తి పొందడానికి.. ఆముదం ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆముదం నూనె కంటికి కలిగిన అసౌకర్యాన్ని, చికాకును తొలగిస్తుంది. ఆముదం నూనె కంటిలో వేసుకున్నప్పుడు కొద్దిగా మంట అనిపించినప్పటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
సూర్యుడి నుంచి వెలువడే కిరణాల వల్ల కళ్ళు చికాకుగా అనిపిస్తే అతి నీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవడం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. దుమ్ము, వాయు కాలుష్యం నుంచి సన్ గ్లాసెస్ మన కళ్లను రక్షిస్తాయి. అదేవిధంగా ఈతకు వెళ్లే వారు తప్పకుండా గాగుల్స్ ధరించాలి.
కళ్ళు ఎర్రగా ఉండి అలసిపోయినప్పుడు కీర దోసకాయ ముక్కలను కళ్లపై 20 నిమిషాలపాటు ఉంచడం వల్ల కళ్లకు చల్లదనం కలుగుతుంది. కళ్లు తాజాగా మారుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.